జోన్ 2 కమిషనర్ కు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేస్తున్న జనసేన నేతలు.

జోన్ టు కమిషనర్- కే కనకమహాల


క్ష్మికి గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేస్తున్న జనసేన నేతలు. ----భీమిలి నియోజకవర్గం మధురవాడ---- (ప్రజాబలం న్యూస్ ) మధురవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్లకు ఇరువైపులా ఉన్న కల్వర్టులపై విరిగిపోయిన పలకలను వెంటనే వేయాలని విజ్ఞప్తి చేస్తూ జోన్ టు కమిషనర్ కే కనకమహాలక్ష్మికి సోమవారం గ్రీవెన్స్ లో వినతి పత్రాన్ని అందజేశారు. కొమ్మాది జంక్షన్ నుండి కార్ షెడ్ కూడలి వరకు కల్వర్టులు పై ఉన్న పలకలు విరిగిపోయానని వాటిపై కొత్త పలకలు వేసి ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వర్షాలు పడితే రోడ్లపై నీరు పొంగిపొర్లుతోందని దీనివలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని వినయ పూర్వకంగా కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సీనియర్ జనసేన నేత పెద్దాయన కృష్ణయ్య, ఏడో వార్డు జనసేన నేత పోతిన తిరుమల రావు, శ్రీను, సతీష్, 8 వ వార్డ్ జనసేన నేత కేసరి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.