అమరావతి:- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాసరావు, సమాచార శాఖ కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి, 2023 --24 సంవత్సరానికి గాను ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే వివిధ పథకాలు నిధులు కేటాయింపు పై క్యాలెండర్ విడుదల చేశారు. దాని ప్రకారం సంక్షేమ పథకాలు ఆయా తేదీలో ఇవ్వనున్నారు. ప్రజలలో నమ్మకం పెంపొందించడం కోసం విడుదల చేసే ఈ క్యాలెండర్ విడుదలతో వారిలో ఆనందం వెల్లి విరుస్తుంది. కచ్చితంగా ఏ నెలకా నెల సంక్షేమ పథకాల నిధులు మంజూరు కావడం హర్షించాల్సిన విషయమే. వాటిని కొనసాగించడం జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు పెట్టింది పేరు. తన తండ్రి రెండు అడుగులు వేస్తే తాను నాలుగు అడుగులు వేస్తానని, తన ఫోటో ప్రతి ఇంటిలో ఉండాలని ఆయన పెట్టుకున్న టార్గెట్ పూర్తి చేసేందు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తాను ప్రజలకు ఇచ్చిన మాట కోసం సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు.
చెప్పుకొనేందుకు ఈ క్యాలెండర్ ఒక ఉదాహరణ.అని చెప్పక తప్పదు.సంక్షేమ పథకాలే తనకు శ్రీరామరక్ష అని దృఢమైన నమ్మకంతో పనిచేస్తున్న ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సి ఉంది. గత 45 నెలల్లో 2,96,148.09 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదల సంక్షేమానికి ఖర్చు చేసామని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున పేదల సంక్షేమానికి ఖర్చు చేసిన ఘనత ఒక్క జగన్కే చెల్లితోందని హర్షం వ్యక్తం అవుతుంది.