2024 ఎన్నికల్లో వైసిపి విజయ డంకా మోగించేందుకు కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలి -- సీనియర్ వైసీపీ నేత బంక సత్యం పిలుపు

 


కన్వీనర్లంతా బాధ్యతగా పనిచేయాలి --- వైసీపీ అధ్యక్షులు బంక సత్యం.


ఆనందపురం మండలం - పరిషత్ కార్యాలయం లో మంగళవారం 


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ''జగనన్న నీవే మా నమ్మకం నీవే మా భవిష్యత్తు ''కార్యక్రమం ను మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులుముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలతో సచివాలయ కన్వినర్ ల తో సమీక్ష సమావేశం పార్టీ అధ్యక్షులు బంక సత్యం ఆద్వర్యంలో నిర్వహించారు.


 ఈ సందర్భంగా మండల వైసిపి శ్రేణులు సచివాలయ కన్వినర్ ల ఇంచార్జ్ గండిగుండం శ్రీను ని సన్మానించడం చేసారు.


అనంతరం బంక సత్యం - శ్రీను చేతులు మీదుగా మండలం లో గల 18 సచివాలయాలకు నియమించిన 54 మంది కన్వినర్ లకు జగనన్న కిట్టులను అందజేశారు.


 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం లో నాయకులు ఉండరు, ప్రజా సేవకులు మాత్రమే ఉంటారని ప్రతి కార్యకర్త పార్టీ కి నిశ్వార్థ సేవకుల గా పని చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు మీపై ఉంచి ననమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని సూచించారు. కన్వీనర్లుగా నియమించడానికి అసలైన ఉద్దేశం ఈ 4 ఏళ్ళలో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా, పైసా లంచం లేకుండా, సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంపూర్ణంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. ఆయన అందించిన పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా ప్రజలకు ప్రచారం చేయాలని ఇది భారంగా కాకుండా బాధ్యత గా తీసుకోవాలని మేమే కూడా మీకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని, నియమింపబడిన కన్వినర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.


అనంతరం గండిగుండం శ్రీను గారు మాట్లాడుతూ నన్ను నమ్మి ఇచ్చిన ఈ పదవిని అదికారంగా భావించకుండా సేవా భావంతో 




  అందరిని కలుపుకుంటూ 2024 ఎన్నికల్లో వైసిపి పార్టీ గెలుపే ధ్యేయంగా చిత్తశుద్ధి నిబద్దత తో పని చేస్తానని,జగనన్న నీవే మా నమ్మకం నీవే మా భవిష్యత్ కార్యక్రమం ను కార్యాచరణ తో సంపూర్ణంగా పూర్తి చేస్తానని అన్నారు.


ఈ కార్యక్రమంలో ఆనందపురం మండలం వైసిపి పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.