ఇఫ్తార్ విందులో6 వవార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక

 ఇఫ్తార్ విందు లో పాల్గొన్న జీవియంసి చీఫ్ విప్ 6 వ వార్డ్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక.



భీమిలి నియోజకవర్గం-- మధురవాడ (ప్రజాబలం న్యూస్ ) --


6వ వార్డు K1 కోలనీలో సియాద్రి కనకరాజు ఆద్వర్యంలో ఇఫ్తార్ విందు ఆదివారంఏర్పాటు చేశారు.


ఈ కార్యక్రమానికిముఖ్య అతిథులు గా 6వ వార్డు కార్పోరేటర్ జీవియంసి చీఫ్ విప్ ముత్తంశెట్టి లక్ష్మి ప్రియాంక భీమిలి నియోజకవర్గం వైసిపి నాయకులు శ్రావణ్ కుమార్, హాజరై విందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా

ప్రియాంక మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులు అత్యంత నిష్ట నియమాలతో ఆచరించే పండుగ రంజాన్ ఈ పండుగ మొదటి రోజు మొదలుకొని 30 రోజైన చివరి దినం వరుకూ 10 సం పిల్లలు దగ్గర నుంచి వృద్దులు వరుకూ ఉదయం సెహరీ తో ప్రారంభించి సాయింత్రం ఇఫ్తార్ విందు వరుకూ ఉపవాసం తో ఉండి ఖురాన్ పఠనం చేస్తూ నమాజ్ (ప్రార్థన) తో భగవాన్ అల్లా తో సమీప సహవాసం కలిగి ఉంటారని అన్నారు.ప్రతీ రోజు సాయంత్రం కాలం అందరూ కలిసి ఇలా ఇఫ్తార్ ఆచరించడం వారి మత ఆచారం అంత గొప్ప విందులో తాము బాగస్తులు కావడం మా అదృష్టం గా బావిస్తున్నామని అల్లా మెండైన ఆశీర్వాదాలు ఎల్లవేళలా అందరికి కలగాలని, విందుకు ఆహ్వానించి నందుకు దన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.


 అవార్డు అధ్యక్షులు బి అప్పలరాజు అవతార్ సింగ్,తదితరులు  పాల్గొన్నారు.