ఘనంగా చంద్రబాబు 73వ జన్మదిన వేడుకలు.--- అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు తోనే సాధ్యం -- భీమిలి టిడిపి ఇన్చార్జ్ కోరాడ

 ఉద్యోగ ఉపాధి కల్పన చంద్రబాబు తోనే సాధ్యం--- భీమిలి ఇన్చార్జి కోరాడ.



 భీమిలి నియోజకవర్గం - మధురవాడ ---- (ప్రజాబలం న్యూస్ ) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు 5వ వార్డు పరిధి బొట్టవానిపాలెం లో గల పార్టీ కార్యాలయం లో వై.ఎస్.ఆర్.కాలనీ,రాజీవ్ గృహకల్ప(మారికవలస)లలో కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ లో కాబోయే ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ముఖ్య అతిథులుగా భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు,రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు,టిడిపి సీనియర్ నాయకులు వాండ్రాశి అప్పలరాజు హాజరై కేక్ కటింగ్,మజ్జిగ పంపిణీ చేశారు. .నాయకులకు కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకొని కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు..ఈసందర్భంగా భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు మాట్లాడుతూ....విశాఖ నుండి పరిపాలన చేస్తాం అంటున్న జగన్ కి రాజధాని అంశం సుప్రీం కోర్టులో ఉందన్న విషయం తెలియదా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల నిరుద్యోగులకు ఒరిగింది ఎంలేదని,అభివృద్ధి సంక్షేమం గాలికి వదిలి పరిపాలిస్తున్నారని రాష్ట్రం లో ఎప్పుడు ఎన్నికలు జరిగిన జగన్ ప్రభుత్వం కి గుణపాఠం చెప్పడానికి నిరుద్యోగులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాజబాబు అన్నారు. కార్పోరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, విద్యా వ్యవస్థ మారాలన్నా,,నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు..ఐటీని ప్రోత్సహించి,వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి,వివిధ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతిపధంలో నడిపించిప్రపంచం మొత్తం రాష్ట్రం వైపుచూసేలా చేశారని పేర్కొన్నారు.అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఐదేళ్ళలో రాష్ట్రానికి రూపురేఖలు తీర్చిదిద్ది రాజధాని నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు.టిడిపి సీనియర్ నాయకులు వాండ్రాశి అప్పలరాజు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మొత్తంగా 14సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు పాలనలో సంపూర్ణ ప్రజా స్వామ్యం అడుగడుగున కనిపిస్తోందని,బాబు ఆలోచన ఆచరణ ప్రవర్తనతో పరిపాలనలో రాష్ట్ర ఆర్థికంగా ఎంతో ఎదిగిందని అన్నారు. పరిపాలనలో దాపరికం లేకుండా పారదర్శకత తేవడానికి ఆయన కృషి అమోఘం అన్నారు.ఓటు బ్యాంకులను దృష్టిలో పెట్టుకోకుండా ధైర్యంగా సాహ సోపేతంగా ముందడుగు వేశారని చంద్రబాబు నాయకత్వంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు రానున్నాయని అన్నారు. రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు,అభిమానులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, టిడిపి తోనే రాష్ట్రాభివృద్ధి అన్నారు. నారా చంద్రబాబునాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను అని మొల్లిలక్ష్మణరావు అన్నారు.ఈకార్యక్రమంలో 5వ వార్డు అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ (జపాన్), కార్యదర్శి ఈగలరవి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బోయిరమాదేవి శ్రీనివాస్,ఎస్సిసెల్ అధ్యక్షులు లంక రాజేంద్రప్రసాద్ (పొట్టిప్రసాద్), ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు,యువత అధ్యక్షుడు కొండపు రాజు,బొడ్డేపల్లిరంగా,ఆవాల నీలయ్య, బోర అప్పలసూరిబాబురెడ్డి,దాలిమదొర, నూకరాజు,నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు సరస్వతి, అరుణ జ్యోతి,నీలపూ జయ, ఆవాల నారాయణ రావు, జోగ సూర్య,ఆనందరావు, బొట్ట కోటి, భాస్కర్,మన్యాల హనుమంతరావు, నాగేశ్వరరావు,చక్రపాణి, అప్పారావు, దాలిమదొర,నాగోతి అప్పలరాజు,వెంగళరావు, నూకరాజు ,మొకర రవి ,శ్రావణ్, పిల్ల వెంకట్రావు, పెద్ద రమణ, హరికృష్ణ ,విజయ్,మాధవ, విష్ణు,రాంబాబు, బొట్ట అప్పలరాజు, నమ్మి వాసు, వెంకటేష్ అప్పారావు, బొట్ట పెంటయ్య, తదితరులు


పాల్గొన్నారు.