జగనన్న పాలనలో మహిళలే మహారాణులు --- అవంతి శ్రీనివాస్.
భీమిలి నియోజకవర్గం - ఆనందపురం మండలం - శనివారం -3వ విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమం
ఆనందపురం మండలం లో 3వ విడత ఆసరా కార్యక్రమం ఘనంగా చేశారు.
కార్యక్రమం లో బాగంగా విచ్చేసిన మహిళల వద్దకు నేరుగా వెళ్ళి వారితో మాట్లాడుతూ సమస్యలు ఏమైనా ఉన్నాయా సమయానికి సంక్షేమ పథకాలు వాలంటీర్లు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకోగా సమయానికి అందిస్తున్నారని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన గ్రామీణ ప్రాంతపు నిత్యవసర వస్తువుల స్టాల్ లను పర్యవేక్షించడం చేసారు.
కార్యక్రమం లో బాగంగా అవంతి గారు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం జగనన్న పాలనపై పలువురు మహిళలు మాట్లాడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం లో నిరంతరం ప్రజలు మద్య తిరిగే మీరు అందిస్తున్న పాలనతో మేమంతా చాలా సంతోషం గా ఉన్నామని మరల ముఖ్యమంత్రి గా జగన్ అన్న మాట యంయల్ఏ గా మీరే రావాలి కావాలని సంతోషం వ్యక్తం చేశారు.
కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు కాదు పేదవాడికి పిడికెడు అన్నం పెట్టలేని అభివృద్ధి అసలు అభివృద్ధే కాదు పేద మధ్య తరగతి వాడికి కావాల్సినవి గూడు కూడు వైద్యం కూడు అనేది సంక్షేమ పథకాలు అమలు తో గూడు అనేది జగనన్న కోలనీతో వైద్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తో జగనన్న అందిస్తున్నారని మాటలతో కోటలు కట్టడం జగనన్న కు రాదని చేతలతో చేసి చూపించడమే ఆయనకు తెలుసని పాదయాత్ర లో ఇచ్చిన హామీలకు గానూ అది చేసి చూపారని గత ప్రభుత్వాలు ఎలక్షన్ కు ముందు ఉండే హామీలు గెలిచాక ఉండేవి కాదని వైసిపి ఓట్లు ఎలక్షన్ కోసం పని చేసే పార్టీ కాదు అని ప్రజలకు మంచి చేయడానికి ఉన్న పార్టీ అని మీకు అన్నం పెట్టే నాయకుడు ఎవరో సున్నం పెట్టే నాయకుడు ఎవరో మీరే గ్రహించాలని దేవుడి దయ మీ దీవెనలు జగనన్న కు ఉన్నంత కాలం ఆయనకు ఎదురులేని ఆయన పాలనలో ఈ నాలుగు ఏళ్ళలో సంక్షేమం అభివృద్ధి పరంగా ఒక్క మీ ఆనందపురం మండలం కే రమారమి 350 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ గెలవడం తథ్యమని మీరంతా ఆయన వెంట నిలిచి మీ మహిళలు కు అందించిన సంక్షేమ పథకాలు అమలు దృష్టి లో ఉంచుకుని ఓటు తో దీవించి ముఖ్యమంత్రి ని చేయాలని కోరారు.
అనంతరం అవంతి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా ఆనందపురం మండలం లో 1291 సాంఘాలకు 13701 మంది సభ్యులు కు 10,45,03,489 కోట్లు రూ చెక్కును అందజేశారు.
3వ విడత వైయస్సార్ ఆసరా అందించినందుకు గాను కృతజ్ఞతతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చిత్ర పటానికి మహిళలు సంతోషం పాలాభిషేకంచేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మండలం ముఖ్య నాయకులు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.