వైసీపీ శ్రేణుల్లో జోష్

 - ప్రజా స్పందన తో వైసిపి శ్రేణులు జోష్ - భీమిలి నియోజకవర్గం-- (ప్రజాబలం న్యూస్ ) (మధురవాడ) ----టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పరిశీలనలో అవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గడప గడపకు జగనన్న నీవే మా నమ్మకం కార్యక్రమం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం లోగల ఆనందపురం గ్రామంలో విశేష స్పందన లభించింది.



 ఈకార్యక్రమం లో బాగంగా వైవి సుబ్బారెడ్డి అవంతి శ్రీనివాసరావు గడప గడపకు వెళ్ళి లబ్దిదారు లను కలిసి నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన పై అవగాహన కల్పిస్తూ జగనన్న అందించిన కిట్టు ను అనుసరిస్తూ ఆయన పాలన కోసం అడిగి తెలుసుకున్నారు.


ఆయన పాలనపై మహిళలు చాలా సంతృప్తి తో సంతోషం గా ఉన్నామని ప్రభుత్వ కార్యాలయాలు కి కాళ్ళు అరిగేలా తిరిగకుండా నేరుగా వాలంటీర్లు ద్వారా నాయకులు సిఫార్స్ లు గాని ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా గడప వద్దకే అందిస్తున్నారని మళ్ళీ జగనే రావాలి కావాలని కోరడంతో గడప గడప లో ప్రజలు నుంచి వస్తున్న మంచి స్పందన కు వైసిపి శ్రేణుల్లో మంచి జోష్ నెలకొంది అని తెలిపారు.