కొవ్వొత్తుల ప్రదర్శనతో అంబేద్కర్ కు నివాళులర్పించిన- సిపిఎం

 భీమిలి నియోజకవర్గం -- మధురవాడ( ప్రజాబలం న్యూస్ )-



కె వి పీ ఎస్,సి ఐ టీ యు ఆధ్వర్యంలో

అంబేద్కర్ కి కొవ్వొత్తుల తో నివాళి..


అంబేద్కర్ ఆలోచన విధానం,అయాన బోధించిన విధంగా ప్రజందరు ఐక్యంగా ముందుకు వచ్చి, మన దేశాన్ని,దేశ ప్రజల హక్కులను కాపాడుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గురువారం

ఏప్రిల్ 14 డాక్టర్ బీ ఆర్ అందేద్కర్ 132 వ జయంతి పురస్కరించుకుని కొమ్మాధి గ్రామంలో కొవ్వొత్తుల వెలుగు తో ప్రదర్శన నిర్వహించారు.

అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తూ నినాదాలు చేశారు.

అనంతరం వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ మన దేశ ప్రజలందరూ సమాన అవకాశాలు,హక్కులు తో జీవించాలని తెలియ చేశారని,కానీ కానీ మన పాలకులు మనాహక్కులు కాల రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కులారహిత సమాజం కోసం జీవితమంతా త్యాగం చేసి పోరాడారని కొనియాడారు.కానీ మన దేశంలో,రాష్ట్రం లో నేటి పాలకులు కుల తత్వాన్ని పెంచి పోషించడమే కాకుండా అంతరాలు సృష్టిస్తున్నారని,వైషమ్యాలు పెంచి పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పై రోజురోజుకీ దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అంబేద్కర్ సమాజంలో సంపద ప్రజలందరికీ సమానంగా అందే విధంగా చెపితే కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం,రాష్ట్రంలో ఆధాని,అంబానీ మరికొంత మంది దూపిడి ధారులకు విచ్చల విడిగా దోచి పెడుతున్నారని అన్నారు.

సామాన్య ప్రజల పై తీవ్రమైన భారాలు వేస్తున్నారని తెలియ జేశారు.సామాన్య జానీకమంతా ఐక్యంగా అంబేద్కర్ చూపించిన బాటలో నడిచి ఉద్యమించాలని సూచించారు. అదే మనం అంబేద్కర్ కి ఇచ్చిన నిజమైన నివాళులని అన్నారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు సియాద్రి పైడితల్లి కే నాగరాజు జి కిరణ్ ఎం ఆదిలక్ష్మి,కే పుష్ప, సిఐటియు నాయకులు డి కొండమ్మ, పి రాజ్ కుమార్,పి రాజుకుమార్,డి అప్పలరాజు,ఐద్వా నాయకులు బి భారతి,కే సుజాత,తదితరులు పాల్గొన్నారు.