మధురవాడ, --- వైజాగ్ కన్వెన్షన్ హాల్ లో బుధవారం జరగనున్న టిడిపి జోన్ 1 క్లస్టర్ల సమావేశం ఏర్పాట్లను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బృందం. పరిశీలించింది. మధురవాడ వీ కన్వెన్షన్ లో బుధవారం జరగబోయే సమా వేశానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న నేపథ్యంలో సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు ఆ పార్టీటీ శ్రేణులు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఉత్తరాంధ్ర టిడిపి ఇన్చార్జ్ బుద్ద వెంకన్న మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలను వైసిపి దోచు కుంది 50 వేల కోట్ల విలువైన భూము లను విజసాయి రెడ్డి దోచుకున్నారు 94 ఎన్నికలు 2024 ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుంది బూతు స్ధాయి నుంచి కార్యకర్తలను ఎలా మోటి వేట్ చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం రేపు జరగబోయేది విజయ శంఖా రావం ఉత్తరాంధ్ర నుంచే నాంది పలుకుతాము మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన ఉత్తేజం మధ్య రేపు చంద్ర బాబు పర్యటన జరగబోతోంది 34 అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్ష జరుగుతుంది జగన్ జరిపిన రివ్యూ చూశాము ఎక్కడా హెచ్చరికలు లేవు బుజ్జగింపులే చూశాము మంత్రులను మారుస్తా మని చెప్పి ఆగిపోయారు. కొంతమంది ముఖ్య నేతలు సమావేశానికి హాజరు కాకపోవడం జగన్ పై ఎంత అసంతృప్తి ఉందో తెలుస్తోందని చెప్పుకొచ్చారు.
సెమీఫైనల్ లో ఫలితాలు చూసి ఖంగు తిన్నారు. జగన్ నిర్వహించిన నిన్నటి సమా వేశానికి ఎప్పుడు హాజరయ్యే పార్టీ పెద్దలే వెళ్లలేదు మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మేధావులు ఓటింగ్ లో పాల్గొన్న ఎన్నికలంటే వైసిపి చులకనలా వుంది అరకొర చదువులు చదివి ఫేక్ సర్టిఫికెట్లతో పదవులు ఏలుతోన్న వారి నుంచి ఇలాంటి మాటలే వస్తాయన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చినా మేము సిద్దం మని అన్నారు. జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ దువ్వార్పు రామారావు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ ఉత్తర నియోజకవర్గం ఇన్చార్జి చిక్కాల విజయబాబు స్థానిక నాయకులు మొల్లి లక్ష్మణరావు పిల్లా వెంకట్రావు దాసరి శ్రీనువాసురావు పిఎస్ నాయుడు , రెడ్డి సత్యనారాయణ,తదితర తెలుగుదేశం నాయకులు ఉన్నారు.