మా నమ్మకం నీవే జగనన్న-- హుషారుగా సాగుతున్న అవంతి విస్తృత ప్రచారం.

 10 వ రోజు


మా నమ్మకం నీవే జగనన్న కార్యక్రమం లో హుషారుగా ఎమ్మెల్యేఅవంతి శ్రీనివాస్.

 భీమిలి నియోజకవర్గం- మధురవాడ -( ప్రజా బలం న్యూస్ -) జీవీఎంసీ 7వ వార్డు పరిధిలో 

పోతిన శ్రీను ఆధ్వర్యంలో గణేష్ నగర్ లో మా నమ్మకం నీవే జగనన్న కార్యక్రమం నిర్వహించారు.


 ఈకార్యక్రమం లో బాగంగా అవంతి శ్రీనివాసరావు స్థానిక నాయకులు సచివాలయ కన్వినర్ లు గడప గడపకు వెళ్ళి నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన పై ప్రజలకు వివరించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.


 ప్రజలు నుంచి సంపూర్ణ మద్దతు రావడంతో గణేష్ నగర్ వైసిపి శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. జై జగన్ జై అవంతి అంటూ నినాదాలతో తో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైసీపీ నేత అల్లాడ లింగేశ్వరరావు, జె ఎస్ రెడ్డి, అప్పన్న, ఎంవి రమణమూర్తి, పసుపులేటి గోపి, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.