ఇఫ్తార్ విందులో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.
భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం (ప్రజాబలం న్యూస్ ) -
ఆనందపురం మండలం మసీద్ లో ఇఫ్తార్ విందు మంగళవారంఘనంగా ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముఖ్యఅతిథిగా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలతోప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం అవంతి మాట్లాడుతూ ఆనందపురం మండలం లో ముస్లింలు హిందువులు మమేకమై సోదర భావంతో కులమతాలు అతీతంగా రంజాన్ ఇప్తార్ విందు పాటించడం చాలా సంతోషం గా ఉందని మత సామరస్యానికి ప్రతీక గా నిలిచిందని పేర్కొన్నారు.
బీదవాడి ఆకలి బాద ఎలా ఉంటాదో తెలియాలి అన్నది మహమ్మద్ ప్రవక్త ఉపదేశించిన గొప్ప స్ఫూర్తి దాయకమైన, ఉపదేశంఅని దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరించడమే ఈ ఇఫ్తార్ విందు ఆచారము అని, ఆథ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన, రంజాన్ మాసం లో ప్రత్యేక ప్రార్థనలు రోజూ కఠినమైన ఉపవాస దీక్షలు దానధర్మాలు, ఆథ్యాత్మికం సందేశాలు సాగడం తో పాటు మహమ్మద్ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవుల కష్టాలు నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించబడిందని,ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లిం ల ప్రగాఢ నమ్మకం ఆ నమ్మకం అల్లా మెండైన ఆశీర్వాదాలు ఎల్లవేళలా అందరికి కలగాలని కోరుకుంటున్నాను అన్నారు. విందుకు ఆహ్వానించి నందుకు దన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మండలం వైసిపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.