చంద్రంపాలెంలో జోరుగా సాగుతున్న మా నమ్మకం నువ్వే జగనన్న.

 భీమిలి నియోజకవర్గం.- మధురవాడ - (ప్రజాబలం న్యూస్ ) ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన మా నమ్మకం నువ్వే జగనన్నా, జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలతో 7వ వార్డ్ వైసీపీ అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జివియంసి జోన్2 మధురవాడ ఏడవ వార్డు 59వ సచివాలయ పరిధి చంద్రంపాలెం గ్రామ శివారు కె.యన్.గార్డన్ అపార్ట్మెంట్ లో "మా నమ్మకం నువ్వే జగనన్నా, మా భవిష్యత్ నీవే జగనన్న కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పధకాల గురించి ప్రజల నుంచి వారి అభిప్రాయాలు సేకరించి ఇంటింటికి స్టిక్కర్స్ అంటించి ప్రభుత్వ పధకాల గురించి వివరించడం జరిగింది. ఏ ఇంటికి వెళ్లి ఎవరితో మాట్లాడినా రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగున్నాయి అని, మళ్ళీ మళ్ళీ వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామని, అదే విధంగా మన భీమిలి శాసన సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జగన్ మోహన్ రెడ్డి, ఆశీస్సులతో మన ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయిస్తున్నారని రానున్న రోజుల్లో మరల మరల ఆయన్నే శాసన సభ్యులు గా గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పిళ్లా సూరిబాబు, జగుపిల్లి నరేష్ పోతిన పైడిరాజు, పిళ్లా అప్పన్న, టి.వరలక్ష్మీ, ఆర్ పి పీస సూర్యకళా, సచివాలయ గృహ సారధులు, వాలలింటీర్స్ తదితరులు పాల్గొన్నారు.