ముఠా కళాసిలు సంక్షేమ బోర్డు సాధనకై పోరాడండి--- సిపిఐ వామనమూర్తి పిలుపు

 ముఠా కళా సి లు సం


క్షేమ బోర్డు సాధనకై పోరాడండి--- జి వామన మూర్తి పిలుపు - విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ )----శ్రమజీవులైన ముఠా కళా సి లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు చేయాలని 137 మే డే ను పోరాట దినంగా పాటించాలని కోరుతూ తేదీ 29 శనివారం జ్ఞానాపురం కూరగాయల మార్కెట్లో కళ సీలు నిరసన ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ శ్రమజీవులైన ముఠా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని,పెరిగిన ధరలకు అనుకూలంగా కూలి రేట్లు పెంచాలని, ముఠా కార్మికులకు పని భద్రత కల్పించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆస్తులైన విశాఖ స్టీల్ ప్లాంటు,రైల్వే రక్షణ రంగం రోడ్లు ఆయిల్ కంపెనీలు,బ్యాంకులు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలను అదాని అంబానీ రిలయన్స్ లాంటి ప్రైవేటు బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి, నిరుద్యోగులను పెంచే ప్రధాని మోడీ సీఎం జగన్ ప్రభుత్వ విధానాలను కార్మిక వర్గం త్రిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ఇంటి పన్ను కరెంట్ ఛార్జీలను రద్దుచేసి కార్మికులకు ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.60 సంవత్సరాల దాటిన ముఠా కళ సి లకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని, డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలోసిపిఐ నాయకులు రావికృష్ణ ముఠా కళాసి సంఘం మేస్త్రులు పైలా కృష్ణ ఆర్ నూకరాజు కే రాము, వై సన్యాసిరావు ఆర్ రాము ఆర్ వెంకట్రావు ఎల్ రాము,డి శ్రీనివాసరావు,వై సన్యాసిరావు,ఆర్ చిన్న కే శ్రీను పి గంగాధర్ రావు పాల్గొన్నారు.