గడప గడపకు మన ప్రభుత్వం -- ఎర్రని ఎండలో జోరుగా. సాగుతున్న అవంతి ప్రచారం--

 గ్రామ స్వరాజ్యం జగనన్న తోనే సాద్యం ---భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.



భీమిలి నియోజకవర్గం - పద్మనాభం మండలం.


 కోరాడ (పెద్దపేట) భీమిలిఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జోరుగా సాగింది. 


రెండవరోజు పర్యటన లో బాగంగా 545 (12 క్లస్టర్స్ ) గడప గడపకు వెళ్ళి నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకివెళ్తున్నారు..


నాలుగేళ్ళ పాలనపై ప్రజలు అబిప్రాయం సేకరణ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా కూడా లంచం లేకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకు నేరుగా జరుగుతున్న పనులను కళ్ళకు హత్తుకున్నట్లు వివరిస్తూ ప్రజల మధ్య దూసుకుపోతున్నారు.. 

 ఈ సందర్భంగా మహిళలు,గ్రామ పెద్దలు అక్కడ ఉన్న సమస్యలను అవంతికి వివరించారు.



పెద్దపేట - పడగల పేట - యస్సి కోలనీ - బిసి కొలనీ లో


 సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని


డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టాలని


ఇంటింటి కొళాయి లు నిర్మాణం చేపట్టాలని,


జగనన్న కోలనీ ఇళ్ళు 40 మందికి ఇప్పించాలని,

కల్లిపిల్లి వారి కళ్ళాలు లో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, పలు సమస్యలను అధికారుల మధ్య అవంతి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు ఆయా సమస్యలను పరిష్కారంచేయాలని ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలప్రభుత్వ సచివాలయ, అధికారులు వైసిపి నేతలు, సచివాలయం కన్వినర్ లు,గృహ సారథులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు.