మోడీని గద్దె దింపుదాం ! దేశాన్ని కాపాడుకుందాం !!
ఇంటింటికి సిపిఐ, సిపిఎం ప్రచారభేరి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ప్రజలకు పిలుపు
భీమిలి నియోజకవర్గం మధురవాడ --- (ప్రజాబలం న్యూస్ )
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 30 వరకు సిపిఐ, సిపిఎం నిర్వహించే ఇంటింటికి సిపిఐ ప్రచారభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు, సిపిఎం మధురవాడ జోన్ కార్యదర్శి డి అప్పలరాజులు పిలుపునిచ్చారు. శనివారం జీవీఎంసీ 5 వార్డు నగరంపాలెంలో ఇంటి ఇంటికి కరపత్రాలు పంచే కార్యక్రమం లో పైడిరాజు పాల్గొని మాట్లాడుతూ గ్రామాలలో ఉండే సమస్యలు పరిస్కారం కోసం వామపక్ష పార్టీలు పాదయాత్రలు నిర్వహిస్తున్నాయని మధురవాడ జాతీయ రహదారి నుండి నగరంపాలెం రహదారి ప్రారంభించి ఏళ్ళు గడుస్తున్నా పూర్తి చెయ్యకపోవడం రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకి నిదర్శనం అన్నారు.
సిపిఎం జోన్ కార్యదర్శి డి అప్పలరాజు మాట్లాడుతూ స్వతంత్ర నగర్, అయోధ్య నగర్, ద్రోణంరాజు కళ్యాణ మండపం వద్ద, పాత మధురవాడ సహా ఏరియా లో ఉన్న మంచినీరు ట్యాంకులు పాడైపోతున్నాయని వీటి స్థానంలో నూతనంగా ట్యాంకులు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ సిపిఐ సిపిఎం నాయకులు ఎం డి బేగం, భారతి, ఎ గురుమూర్తి రెడ్డి, జి వేళంగినిరావు, త్రినాద్ తదితరులు పాల్గొన్నారు.