విశాఖప
ట్నం మధురవాడ ---యాంటీ కో స్క్వాడ్ ఫౌండేషన్, హ్యాండ్స్ టు హెల్ప్ సంయుక్తంగా నగరాల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మధురవాడ కృష్ణానగర్ కాలనీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం పేదలకు చీరల పంపిణీ చేశారు. రాష్ట్ర నగరాలు కార్పొరేషన్ చైర్మన్ భర్త పిల్లా సత్యనారాయణ మాట్లాడుతూ పేదలకు చీరల పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు.
హాండ్స్ టూ హెల్ప్ ఫౌండర్ చైర్మన్ పిల్లా చిన్ని మాట్లాడుతూ హ్యాండ్స్ టు హెల్ప్ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు పిల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు చీరల పంపిణీ చేయడంతో పాటు ఇంతవరకు అనేక సేవా కార్యక్రమాలు చేసిన చిన్ని ని అభినందించారు.పిళ్ళా సత్యనారాయణ,సీనియర్ పాత్రికేయులు పిళ్ళా విజయ్ కుమార్,నగరాలు వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులు కోరగంజి విజయ్ కుమార్,పోతిన అనురాధ,పిళ్ళా సూరిబాబు, బైపిల్లి ప్రసాద్,బైపిల్లి వరప్రసాద్,పాడి లక్ష్మణరావు, నూకరాజు,వంశీ తదితరులు పాల్గొన్నారు.