గడప కడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు- అవంతి శ్రీనివాస్.
భీమిలి నియోజకవర్గం- మధురవాడ (ప్రజాబలం న్యూస్ )
జీవియంసి 4వ వార్డు లో మొదటిరోజు గడప గడపకు మన ప్రభుత్వం లో పర్యటనలో భాగంగా 260 ఇళ్ళు గడప గడపకు తిరిగి నాలుగేళ్ళు నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గుర్తు చేశారు. ఈ సందర్భంగా
మహిళలతో అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ధనికులు కోసం పని చేస్తే వైసిపి ప్రభుత్వం పేదలు మధ్యతరగతి బుడుగు బలహీన వర్గాల కోసం మహిళలు అభ్యున్నతి కోసం పాటు పడుతూ వారి కళ్ళల్లో ఆనందమే చూడాలన్నదే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యం అని చెప్పారు.
వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అవంతి ఆరా తీయగా అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
నిడుగొట్టు - మెట్ట మీద కోలనీ - పెదబస లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడగగా అవంతి దృష్టి లో పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు అయిన
నిడుగొట్టు లో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని,
బోయిలూరు లో వాటర్ ట్యాంక్ చర్చి దగ్గర నిర్మాణం చేపట్టాలని,
పెదబస లో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని అవంతి దృష్టికి తీసుకెళ్లారు.
త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆయన అక్కడికక్కడకి ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు వార్డు కార్పోరేటర్ లు, వార్డ్ అధ్యక్షులు, ముఖ్యనాయకులు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు పదవుల్లో ఉన్న వారు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.