స్వతంత్ర నగర్లో జోరుగా సాగుతున్న వామపక్షాల ప్రచారం

 ప్రజలపై పన్నులు,ధరలు పెంచీ,వసూలు చేసిన సంపద ఎవరికి పెడుతున్నావు మోడీజీ..


 విశాఖపట్నం-- మధురవాడ (ప్రజాబలం న్యూస్ )

సీపిఐ,సీపీఎం ప్రచారోద్యమ బాగంగాసోమవారం 5 వ వార్డు స్వతంత్ర నగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ కే ఎస్ వి కుమార్




  స్వతంత్ర నగర్ లో పలు చోట్ల మాట్లాడుతూ కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజలను రక రకాల పన్నులు వేసి పీడిస్తుంది అని తెలియ జేశారు.

మోడీ ప్రధాని అయ్యేసరికి 2014 లో వంట గ్యాస్ సిలిండరు ధర 400 రూపాయలు వుంటే నేడు 1150 రూపాయల కు పెంచారని అన్నారు. పెట్రోల్, డీజీల్ అంతే విధంగా 60 రూపాయలు వుండేదని,ఇప్పుడు 110 రూపాయల కు ఈ బీజేపీ ప్రభుత్వం పెంచిందని తెలియ జేశారు. కస్టించీ పని చేసే వారికి కనీస వేతనం 26 వేలకు పెంచకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను మొండిగా అమ్మకానికి పెట్టింది అని ఆవేదన వ్యక్తంచేశారు.స్టీల్ ప్లాంట్ తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు కాపుడు కోవలసిన భాధ్యత ప్రజలందరి పైన వుందని తెలియ జేశారు.కనుక ఈ నెల 26న గాజువాకలో జరిగే భారీ భాహి రంగ సభను జయప్రదం చేయాలని కోరారు.సీపీఐ జోన్ కార్యదర్శి వి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడి రావలసిన నిధులు,సౌకర్యాలు రాబట్టాలని కోరారు.దానికి ప్రతిపక్షాల మద్దతు కూడగట్టాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జోన్ కార్యదర్శి వి సత్యనారాయణ, ఎం డీ బేగం,త్రినాథ్ ,సీపీఎం నాయకులు డి అప్పలరాజు,డి కొండమ్మ, బి భారతి,నారాయణరావు,ఏ మిసలినయుడు తది తరులు పాల్గొన్నారు.