ఐదవ వార్డ్ ప్రజా సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్ హేమలత

 జీవీఎంసీ నూతన కమిషనర్ గా నియమితులైన సాయి శ్రీకాంత్ వర్మను మర్యాద పూర్వకంగా కలిసిన ఐదవ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత - భీమిలి నియోజకవర్గం మధురవాడ (ప్రజా బలం న్యూస్)----జీవీఎంసీ నూతన కమిషనర్ గ నియమితులైన సాయికాంత్ వర్మను సోమవారం ఐదో వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వార్డులో ప్రధాన సమస్య అయిన త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలు అయిన స్వయం కృషి నగర్,వికలాంగుల కాలనీ,డ్రైవర్స్ కాలనీ , కార్పెంటర్ కాలనీలో త్రాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉందని వెంటనే పరిష్కరించాలని అలాగే వీధిలైట్లు, క్రొత్త విద్యుత్ స్తంభాలు, రాజీవ్ గృహకల్ప జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలలో భూగర్భ డ్రైనేజ్ సమస్య,పరిష్కారం చేయాలని వినతిపత్రం అందజేశారు. కొమ్మాది జంక్షన్ నుండి మధురవాడ పైవంతెన వరకు గల సర్వీస్ రోడ్డు డ్రైనేజ్ సమస్య కు శాశ్వత పరిష్కారం, స్మశాన వాటికలు అభివృద్ధి చేయమని తదితర వార్డ్ సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన కమీషనర్ త్వరలోనే త్రాగునీటి సమస్య ల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు..ఈ కార్యక్రమం లో హేమలత తండ్రి టిడిపి సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు ఆమెతో పాల్గొన్నారు.