-పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడు గా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో శోభకృత్ నామ సంవత్సరం శుద్ధ త్రయోదశి తత్కాల చతుర్దశి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అలయ అర్చకులు పట్నాల హరి ప్రసాద్ శర్మ, హరిస్వామిలు నిర్వహించారు, ముందుగా స్వామి వారికి సుప్రభాత సేవతో ప్రారంభమై, సుగంధ ద్రవ్య జలాభిషేకములు జరిపి అనంతరం స్వామివారికి అలంకరణ,నాగవళ్ళీ దళార్చనలు సుంధూరార్చనలు పుష్పార్చన తదితర పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు సభ్యులు పిళ్లా వెంకట రమణ, గ్రామ పెద్దలు పిళ్లా మధు పాత్రుడు, పిళ్లా శ్రీనివాసరావు, ముఖ్య సభ్యులు పిళ్లా అప్పన్న, రాంపిల్లి సత్యం, సూర్యనారాయణ, పి.రాంబాబు తదితరులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.