సి పి ఐ,సి పి ఎం ఆధ్వర్యంలో లో గోడ పత్రిక ఆవిష్కరణ.
భీమిలి నియోజకవర్గం మధురవాడ-- (ప్రజాబలం న్యూస్) ఈనెల 14వ తేదీ నుంచి 30వ తారీకు వరకు సీపీఎం,సీపీఐ పార్టీలు దేశ వ్యాప్తంగా ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీల మధురవాడ జోన్ కార్యదర్శులు డి అప్పలరాజు,వి సత్యనారాయణ తెలియ జేశారు.ఇందు భాగాంగా బుధవారం సీ పీ ఐ మధురవాడ కార్యాలయం వద్ద గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతి రేకా విధానాలు,ప్రజల పై భారాలు,దేశ సంపద లూటీ చేయడాన్ని వ్యతిరేకించడం తో పాటు రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని ప్రజలతో చర్చించనున్నట్లు చెలియ జేశారు.వీటితో పాటు స్థానిక సమస్యలు పరిష్కారం కు ప్రజలను కదిలించే విధంగా కృషి చేస్తామని అన్నారు.
మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు,బ్యాంకులు,ఇతర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు కాపాడు కోవడం కోసం ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్య్రమంలో సి పి ఐ నాయకులు ఎం డీ బేగం,పి వెంకన్న,వి సన్నిపాత్రుడు,సీపీఎం నాయకులు పి రజుకుమర్, సి హెచ్ శేషు బాబు,డి తులసి తదితరులు పాల్గొన్నారు.