బాబు జగజ్జీవన్ రావ్ గొప్ప ఆదర్శవంతుడు

 విశాఖపట్నం


గాజువాక సాయిరాం నగర్ 67వ వార్డు లో గల స్వామి విద్యానికేతన్ హై స్కూల్ లో భారత్ గౌడ్స్ అండ్ గైడ్స్ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ పిలుపుమేరకు బుధవారం బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 67వ వార్డు కార్పొరేటర్ శ్రీ పల్లా శ్రీనివాసరావు మరియు 68 వ వార్డు టిడిపి నాయకులు గండికోట తాతారావు  67వ వార్డు పార్టీ నాయకులు పల్లా రంగబాబు కార్యదర్శి కే సింహాచలం ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో మొదటిగా ముఖ్య అతిథి శ్రీ పల్లా శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేయగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి గారు స్వాతంత్ర సమరయోధుడు జగజ్జీవన్ రామ్  చిత్రపటానికి పూలమాలవేశారు మిగతా అతిధులు కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు అనగా స్కౌట్స్ మరియు గైడ్స్ కబ్స్ మరియు బుల్బుల్స్ కు వివిధ ఫలహారాలు పంచిపెట్టారు.


పాఠశాల ప్రిన్సిపాల్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ హెచ్ డబ్ల్యు బి డాక్టర్ లక్ష్మణ స్వామి గారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు పేదల గుండెల్లో నిండిన సూర్యుడు.

వెనుకబడిన వర్గాలకు ఆశాజ్యోతి భారతదేశ ప్రగతి రథం పై అడుగుపెట్టిన ఖ్యాతి.

డిప్రేస్ట్ క్లాసెస్ లీగ్ స్థాపనయోధుడు కార్మిక వర్గాన్ని చైతన్యం చేసిన వెలుగు వీరుడు.

జగ్జీవన్ రామ్ జాతీయ జీవన ప్రమాణాలకు బ్రతుకు భరోసా ఇచ్చిన ధీరుడు .

తన్మయి స్మారక చిహ్న కేంద్రం సకలజనుల సమానత్వం దినోత్సవం గా జరుపుకుంటున్నట్లు స్వామి  తెలిపారు.

ముఖ్యఅతిథి పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అంటరాని వర్గాలకు అండగనిలిచి అందరికీ సమానత్వ ధోరణి పెంచాడు.

పేదల పాలిటి పెన్నిధి బడుగు బలహీన వర్గాలకు బంధువు, అన్నింటి తానై అందరిలో ఒకరై మానవత్వం విలువలు పెంచి, మంచికి మారుపేరుగా నిలిచి, అత్యున్నత శిఖరమైన నిలిచాడు.

భారత రాజ్యాంగంలో భూముఖ ప్రజ్ఞాశాలివి, పుణ్య భూమీపై అడుగుపెట్టిన పుణ్యమూర్తివి, దేశానికి ఘనకీర్తివి, పేదల ఇండ్లలో వెలుగువి, ప్రజలకు దారిని చూపే పూల బాటవి, పేదల కష్టాలు కడగండ్ల బాపే ఓదార్పువి, మమతలు పంచే సమతామూర్తివి, సబ్బండ వర్గాలకు దిశా నిర్దేశం చేసిన దార్శనికుడివి, సకల సంపదలు కావు ముఖ్యం, సకల జనుల సమానత్వమే ముఖ్యం,

అని గర్వంగా చాటి చెప్పిన నిడారంబర జీవి,

అనునిత్యం పేదల పక్షాన నిలిచిన రాజకీయ దురంధరుడు అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో గైడ్ టీచర్ పి సూర్య కుమార్ బుల్బుల్ టీచర్ పి దేవి పాల్గొన్నట్లు స్కూల్ ఇన్చార్జ్ గరిమెళ్ళ పద్మజ తెలియజేశారు.

డా: బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతోత్సవం లో స్వామి విద్యానికేతన్ హై స్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కబ్బుస్ అండ్ బుల్ బుల్స్ విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం ఉన్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు హెచ్.డబ్ల్యు.బి (స్కౌట్స్) తెలియజేశారు.