ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పోలవరంతో రాజకీయ చదరంగం.

 విశాఖపట్నం:-


ఆంధ్రప్రదేశ్ లో 2024 లో జరగబోయ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగడంతో రాజకీయం వేడెక్కుతుంది.ఏపీలో గెలుపొటములను శాసించే శక్తి ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేంద్రంలో బిజెపి తగిన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లు పోలవరంపై తగిన దృష్టి సారించని కేంద్రం ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై దృష్టి సారించింది. ఏపీలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరిగింది అన్న విషయం పై చర్చ జోరుగానే సాగుతోంది.ఏపీలో రాజకీయాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ బిజెపిని పవన్ సహకారంతో బలపరిచేందుకు అటు వైసీపీ ప్రభుత్వాన్ని డైలామా లో పెట్టి సరైన సమయంలో రింగ్ తిప్పేందుకు బిజెపి సన్నద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చాణుక్యుడు రాజినీతిని ప్రదర్శిస్తున్న మోడీ తగిన రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. పోలవరం అడ్డంగా పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని మేధావులు భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడల్లా పోలవరం ప్రాజెక్టును పావుగా వాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై సోమవారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర జల వనరుల శక్తి శాఖ మంత్రి గజేంద్ర శకావత్ ను కలవడం తో అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పై పడింది. పవన్ కళ్యాణ్ కి పిలుపు రావడంతో వెళ్లిన ఆయన పోలవరం ప్రాజెక్టును నిర్మాణ పనులను వైకాపా ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లయిన ముందుకు కదలటం లేదని అది పూర్తి అయ్యేందుకు తగిన నిధులు మంజూరు చేసి, తగిన చొరవ చూపాలని వినయ పూర్వకంగా కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

 2019 మార్చి నాటికి 72 శాతం పనులు పూర్తీ అయ్యాయని, మిగిలిన పనులు పూర్తి అయ్యేవిధంగా చేస్తేబాగుంటుందని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోలేదని శకావత్ కు వివరించారు. పోలవరం ఏపీకి జీవనాడి అని బహుళ ప్రయోజనాలు అందించే ఈ ప్రాజెక్టును ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచి జరుగుతుందని పేర్కొన్నారు. శకావత్ ను కలిసిన వారిలో పవన్ తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.