ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళి .

 దాత్రి


ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఘన నివాళులు

మధురవాడ:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్132 వ జయంతి సందర్భంగా దాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఘన నివాళులు అర్పించారు. రేవల్లపాలెం రోడ్ లోని అమ్మబడి బాలల సంరక్షణ కేంద్రం నుండి అమ్మఒడి మరియు ఆకర్ బాలబాలికలచే జూన్ 2 కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బుల్లయ్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ దీనబందు

 మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మేథావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ అని కొనియాడారు.బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆథ్యాత్మిక తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి అని వాటికి గట్టి పునాదులు వేసి రాజ్యాంగ నిర్మాత. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ ఆయన హాస్యన సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సి. హెచ్ విశాలాక్షి, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఎం శ్రీనివాసు మూర్తి పాల్గొన్నారు.