చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ---- కోరాడ


 భీమిలి నియోజకవర్గం ----(- ప్రజాబలం న్యూస్ ) భీమిలి నియోజకవర్గ పరిధి పద్మనాభం మండలం ఇసకల పాలెం లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు కోరాడ రమణ ఆధ్వర్యంలోజరిగింది. భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకొని వాటిని రాసుకొని వారి సమస్యల పై భరోసా కల్పించడానికి రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారి సమస్యలను చర్చించి వాటిని ఏరకంగా పరిష్కరిస్తామో ప్రజలకు వివరించి, గ్రామ స్థాయి నుండి మ్యానిఫెస్టో రూపకల్పన జరుగుతుందని,మన సమస్యలు మనమే తీర్చుకునే విధంగా కింద స్థాయి నుండి పరిపాలన సాగిద్దామని తెలియజేస్తూ, ఈ సైకో వై ఎస్ ఆర్ సి పి పాలన 12 నెలల్లో ముగుస్తుంది, ఆ పై వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ప్రజలు అభద్రతాభావం నుండి బయటపడాలన్నా నిత్యావసర ధరలు తగ్గాలన్న ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే ఈ వైసిపి ప్రభుత్వ పాలన నుండి విముక్తి పొందాలని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేసుకునే అవసరం మన రాష్ట్రానికి ఉందని అన్నారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లే దానికి నిదర్శనం అని మార్పుకు నాంది పలికాయని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ రావు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి పద్మనాభం మండల ఎంపీటీసీ కంటుబోతు లక్ష్మీ ఎర్రి నాయుడు నియోజకవర్గ వాణిజ్య విభాగ కార్యనిర్వ కార్యదర్శి కంటుబోతు ఎర్రి నాయుడు సిర్లపాలెం సర్పంచ్ సిర్ల అప్పలనాయుడు ఆవాల గంగరాజు మాజీ ఎక్స్ సర్పంచ్ అప్పలనాయుడు గద్ద పేట ఎక్స్ సర్పంచ్ గద్ద ప్రసాద్ బసవ శ్రీను కెల్లా సురేష్ లింగన్నపేట పైల శీను నరసాపురం ఎక్స్ ఎం పి టి సి రేవల్ల సన్యాసిరావు యడ్ల సూర్యరావు తాళ వలస కిషోర్ ఇసుకల పాలెం గ్రామ నాయకులు కంటుబోతు గౌరినాయుడు,బోని రమణ,వాజిగాని చిన్నయ్య,జనార్ధన్ ,రామినేని అప్పలరాజు, తదితరలు పాల్గొన్నారు.