పాఠశాలల ఆరుబయట చెట్లు కింద తరగతులు నిర్వహించరాదు.-- విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్.

 ఆరు బయట, చెట్ల కింద

 తరగతులు నిర్వహించవద్దు


ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ



 అమరావతి-- ప్రజాబలం న్యూస్ : రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఈ నెల 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని, ఎండల తీవ్రత దృ ష్ట్యా తరగతులను ఆరు బయట, చెట్ల కింద ఎట్టి పరి స్థితుల్లోనూ నిర్వహించరాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న స్కూళ్లలో ఆరు రోజులు తరగతులు నిర్వ హించరాదని, ఇందుకు ప్రత్యామ్నాయంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించాలన్నారు. ఈ నెల రెండో శనివారాన్ని పని దినంగా పరిగణించాలన్నారు. ప్రతి స్కూలులో మంచి నీటి సదుపాయం కల్పించాలని, వైద్య శాఖ సహకారంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సమకూర్చుకోవాలని సూచించారు. స్వచ్చంద సంస్థలు, స్థానిక సంస్థల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. తరగతులు ముగియగానే మధ్యాహ్న భోజనం అందించాలని తెలిపారు.