విశాఖపట్నం.
విశాఖపట్నం :----గోకివాడ లో క్రిష్ణదేవరాయ కాపు సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకుడు కర్రి వెంకట రమణ,వారి బృందం సామాజిక సేవకులకు ఘన సన్మానం చేశారు.
శుక్రవారం గోకివాడ లో కీర్తి శేషులు పొట్నూరు గంగునాయుడు జ్ఞాపకార్ధం 10వ వర్థంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పొట్నూరు శేఖర్ సతీష్,ద్వారపురెడ్డి రాధ, ద్వారపురెడ్డి నాగేశ్వరరావు, ఈశ్వర్ తేజ,అమ్రుత వర్షిణి ఆధ్వర్యంలో జరిగిన వర్థంతి వేడుకలో సామాజిక సేవకులకు ముఖ్య అతిథులు సుందరపు విజయ్ కుమార్, మోటూరు శ్రీవేణి,,బైలపూడి రాందాసు,,జనపురెడ్డి శ్రీనివాస్, వీసం నాగేశ్వరరావు, గొంతిన సతీష్, అనకాపల్లి ఎమ్.వి.ఆర్ సతీష్ అన్నం వెంకట రమణ , కశిరెడ్డి సత్యనారాయణ, మోటూరు సత్యారావు, తుమ్మల సత్యారావు తదితరులు చే ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పేదలకు అన్నదానం, వస్త్ర దానం ముఖ్య అతిథులు చేతులు మీదుగా పంపిణీ చేశారు.
ఈసందర్భంగా కీర్తి శేషులు పొట్నూరు గంగునాయుడు చేసిన సేవలను ముఖ్య అతిథులు సుందరపు విజయ్ కుమార్ మోటూరు శ్రీవేణి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకుడు కర్రి వెంకట రమణ మాట్లాడుతూ కీర్తి శేషులు పొట్నూరు గంగునాయుడు గారు 10 వ, వర్థంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆయన పేరు మీద ఈ విధంగా నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయం అని అందులో సామాజిక సేవకులను సత్కరించడం, పేదలకు అన్నదానం వస్త్ర దానం చేయడం, సామాజిక సేవలు చేయుటకు ఇతరులకు ఒక సామాజిక అవగాహన సదస్సు లా ఉపయోగపడుతుంది అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గోకివాడ సీనియర్ నాయకులు ద్వారపురెడ్డి, అప్పారావు, గోవింద,కాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.