కిడ్నీ బాధితులని ప్రభుత్వం ఆదుకోవాలి -- సిపిఎం డిమాండ్

 భీమిలి నియోజకవర్గం మధురవాడ - (ప్రజాబలం న్యూస్ )


కిడ్నీ భాడితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.---సీపీఎం డిమాండ్..


జీ వి ఎం సి 7వ వార్డు బాంబే కాలని లో పేదరికం,అమాయకత్వం తో ప్రతుకుతున్న అసహాయతును అదునుగా చూసుకొని కిడ్నీ మాఫియా రెచ్చి పోతున్నారనీ సీపీఎం మధురవాడ జోన్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.కిడ్నీ బాధితుడిని,అతని కుటుంబాన్ని సీపీఎం జోన్ కమిటీ సభ్యులు శనివారం వారి గృహం వద్ద పరామర్శించారు.భదితుడుతో,కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ఈ సందర్భంగా సి పి ఎం నాయకులు మాట్లాడుతూ భాడితుడు వినయ్ కుమార్ ను బెదిరించి మరీ కిడ్నీ తొలగించారని తెలియ జేశారు. ఇంత భరితెగించి పేదలను,నిస్సహాయతను కిడ్నీ మాఫియా రెచ్చి పోతున్నారనీ అన్నారు.ఇంకా ఇటువంటి సంగాటనల్లో ఎంత మంది భాద్యులిన్నారో తెలియాల్సి ఉందని అన్నారు.ఈ కిడ్నీ మాఫియా ముఠా పై ప్రభుత్వం,పోలీసులు,జిల్లా ఆరోగ్య శాఖ,రెవెన్యూ శాఖ కటిన చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.

భాడితుని పై వృద్దాప్యం లో వున్న తల్లి,తండ్రులు ఉన్నారని,వారిని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదు కావాలని కోరారు.భాదితుడు ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని,మెరుగైన వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం కిడ్నీ మాఫియా ముఠా ఆటలు కట్టించాలని కోరారు,పరామర్శించిన వారిలో జోన్ కార్యదర్శి డీ అప్పలరాజు,నాయకులు పి రాజు కుమార్,డి కొండమ్మ, బి భారతి,కే సుజాత తదితరులు వున్నారు.