ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ప్రారంభించిన సీఎం- ----- పేదల సంక్షేమమే ధ్యేయం--- ముఖ్యమంత్రి జగన్

 పల్నాడు


జిల్లా -- ఆధునిక వైద్యాన్ని పేదలకు వారి గడప వద్దకు వెళ్లి అవసరమైన ఉచిత వైద్యాన్ని అందించేందుకు" 'ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం' పటిష్టంగా అమలపరుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం, లింగం గుంట్ల గ్రామంలో 'ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం, ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో 49,000 మందికిపైగా వైద్య సిబ్బందిని నియమించి ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. 104 మొబైల్ వ్యాన్ సేవల ద్వారా ప్రతి గడపకు ఫ్యామిలీ డాక్టర్స్ వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారికి అవసరమైన చికిత్స అందించేందుకు తగిన ఏర్పాటు చేశామన్నారు. తాము చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్, పొత్తులు జిత్తులతో ఎత్తులు వేస్తున్నారని తనతో ఒంటరిగా ఎదుర్కొనలేక దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటిలోనూ అక్క చెల్లెమ్మలు, అవ్వ తాతలు, తాను చేసే సంక్షేమ, అభివృద్ధి ఫలాలను కొలమానంగా తీసుకొని తనకు అండగా నిలవాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. గత ప్రభుత్వంలో మీకు జరిగే మేలు, తమ ప్రభుత్వం లో చేసే మేలు కొలమానంగా తీసుకొని ప్రజలే నిర్ణయించాలని కోరారు.