గడపగడపకు అవంతి వీధి వీధిలో అవంతి.

 భీమిలి నియోజకవర్గం - (ప్రజాబలం న్యూస్ )



జీవియంసి 4వ వార్డు లో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం లో పర్యటనలో భాగంగా 837 ఇళ్ళు గడప గడపకు తిరిగి నాలుగేళ్ళు నాలుగేళ్లలో వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేసి వారికి గుర్తు చేశారు.


మహిళలతో అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మహిళలను కేవలం ఓటు బ్యాంకు గానే చూసి గెలిచాక వారిని అలసత్వం చూపేవని, నేటి వైసిపి ప్రభుత్వం లో అంబేద్కర్ రచించిన రాజ్యంగం ప్రకారం వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి, వారిని ఉన్నత పదవులు లలో కూర్చోబెట్టారని పేర్కొన్నారు. మహిళలు అభివృద్ధి చెంది వారికాళ్ళు పై వారునిలబడాలనే ఉద్దేశం తో జగనన్న చేయూత వైయస్సార్ ఆశరా ఇలా పలు సంక్షేమ పథకాలు అమలు చేసి వారికంటూ ఓ ప్రత్యేక స్థానం కల్పించారని అన్నారు. మహిళల అభ్యున్నతి పాటుపడుతున్న జగన్ పక్షపాతి అని,మీరే ఆయన ఆస్తి అని, రాబోయే 2024 ఎన్నికల లో ఆయన్ని మీరే బాద్యత తో గెలిపించాలని కోరారు.


వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అవంతి అడగగా అందుతున్నాయని, వారి నుండి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు.


ఆర్ అగ్రహారం - నేరళ్ళవలస - నేరళ్ళవలస కోలనీ - గువ్వ పేట - నేరళ్ళవలస హాసింగ్ కోలనీ లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడగగా అవంతి దృష్టి లో పెట్టిన దీర్ఘకాలిక సమస్యల

విద్యుత్ టాన్స్ ఫామ్ నిర్మాణం చేపట్టాలని


త్రాగునీటి ఎద్దడి ఉందని సమస్య పరిష్కారం కై వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని


సామాజిక భవనం నిర్మాణం చేపట్టాలని


సమస్యలు అన్ని అవంతి విని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు.


సమస్యలు పరిష్కారం చేస్తానని సంపూర్ణ హామీ ఇచ్చిన అవంతికి స్థానికులు దన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు వార్డు కార్పోరేటర్ లు వార్డు అధ్యక్షులు ముఖ్యనాయకులు - సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు, పదవుల్లో ఉన్న వారు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.