అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పేట - భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

 అభివృద్ధి


సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్--- భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.


భీమిలి నియోజకవర్గం --- పద్మనాభం మండలం లోబుధవారం



రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న 3వ విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా


 బాబు జగజ్జీవన్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం


మహిళలు అభివృద్ధి కి పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిశలు పాలాభిషేకం చేసి జై జగన్ జై అవంతి అంటూ నినాదాలతో హోరెత్తించారు.


డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన పలు రకాలైన స్టాల్స్ ను అవంతి పర్యవేక్షించారు.


కార్యక్రమం లో బాగంగా మహిళలు కోసం వైసిపి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అమలు పాలన పై లబ్ధిదారు చేత మాట్లాడించారు.


కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తాం అని చెప్పి ఏమి చేయకుండా ఎలక్షన్ లో ఓటు కోసం 5 సం తరువాత పసుపు కుంకుమ అందిస్తే మీ మహిళలు కుంకుమ తీసుకొని బాబుకు పసుపు రాసి ఇంటికి పంపించారని పేర్కొన్నారు. మహిళలు అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధి బాధ్యత తో పలు సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి పదవుల్లో కూడా సుమచిత స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని గత ప్రభుత్వాలు ఏదైనా పథకం అందించాలంటే పార్టీ కండువాలు మనోడా కాదా అని చూసి వివక్షతతో కూడిన పాలన అందించేవని జగనన్న పాలనలో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం తీసుకోకుండా నేరుగా ప్రజలకే అందేలా పాలన అందించి,పేదల పట్ల దేవుడై నారని ఇది పేదల ప్రభుత్వం మాటలతో కాక చేతలతో చేసి చూపే పాలన జగనన్నదని, మీ మహిళలు అంతా ఆయనను మరల ముఖ్యమంత్రి ని చేయడానికి మీవంతు కృషి అందించాలని పిలుపునిచ్చారు.


అనంతరం పద్మనాభం మండలం లో 1186 సంఘాలకు గానూ 12575 లబ్థిదారులకు 10,99,66,113 కోట్ల రూ చెక్కును అవంతి శ్రీనివాసరావు చేతులు మీదుగా లబ్దిదారులకు అందజేశారు.



ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మండలం వైసిపి శ్రేణులు లబ్దిదారులు ప్రజలు పాల్గొన్నారు.