నర్సింగరావు అందరికీ ఆదర్శప్రాయుడు.

 విశాఖపట్నం----బొట్ట నర్సింగరావు

సి ఐ టి యు లో నాయకునిగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడమే కాకుండా,గొప్ప నాయకత్వాన్ని తయారు చేసిన నాయకుడని సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్ అన్నారు.

బొట్టా నర్సింగరావు శనివారం19వ వర్ధంతి సమధర్భంగా

కొమ్మా ది సి ఐ టి యు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ముందుగా బి ఎన్ ఆర్ చిత్ర పటానికి కుమార్ పువల మాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం కుమార్ మాట్లాడుతూ మన విశాఖ జిల్లా లో కార్మిక కార్య కథగా ప్రంబించిన తను క్రమశిక్షణ గల

నాయకునిగా ఎదిగారని తెలియ జేశారు.అంతే కాకుండా సీపీఎం నాయకునిగా,కార్పొరేటర్ గా యెనలేని సేవ చేశారని అన్నారు.నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు.బీ ఎన్ ఆర్ గారి పోరాట స్పూర్తితో ఉద్యమాలు ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జోన్ నాయకులు డి అప్పలరాజు, డీ కొండమ్మ, పి రాజు,కే నాగరాజు, కుమార్,జీ విజయ్,కే కొండమ్మ, ఏ గురుమూర్తి రెడ్డి,బి నర్సింగరావు,ఐద్వా నాయకులు బి భారతి, కే సుజాత,ఎం ఆదిలక్ష్మి, కే పైడి రాజు తదితరులు పాల్గొన్నా


రు.