సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన విజయవంతం కావాలని--- భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా రాదే శ్యామ్ యాగం చేపట్టారు.

 రాదే శ్యామ్ యాగం చేసిన అవంతిశ్రీనివాస్ కుటుంబ సమేతం.

 భీమిలి నియోజకవర్గం. (ప్రజాబలం న్యూస్ )--




రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కు ఎలాంటి ఆటంకాలు లేకుండా సుభిక్షంగా పరిపాలన సాగాలని భీమిలి నియోజకవర్గం లో ప్రతీ ఒక్కరు సుఖసంతోషాలతో ఐష్టైశ్వర్యాలు తో జీవించాలని శనివారం వారి సొంత నివాసంలో వేద పండితులు మంత్రోచ్చారణ మద్య కుటుంబం సభ్యులు తో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాదే శ్యామ్ యాగం కుటుంబ సమేతంగా చేశారు. ప్రజా సేవతో పాటు దైవభక్తిని నమ్ముకున్న ఆయన మరింత ముందుకు సాగాలని ఆయన అభిమానులు కార్యకర్తలు భగవంతుని కోరుతున్నారు. ఆయన చేస్తున్న యాగం మంచి ఫలితాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు.