మధురవాడ:-- 6 వ వార్డు పరిధిలోని పిఎం పాలెం, ఆర్ హెచ్ కాలనీ, షిప్ యార్డ్ లేఔట్, హెచ్ పి నగర్ తదితర కాలనీలకు చెందిన స్మశాన వాటిక దుర్భరంగా ఉందని దానిని శుభ్రపరిచే అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని భీమిలి నియోజకవర్గం జనసేన నేత ఈ ఎన్ ఎస్ చందర్రావు సోమవారం గ్రీవెన్స్ లో జోన్ టూ కమిషనర్ కే కనకమహాలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆరో వార్డు జనసేన అధ్యక్షురాలు పోతిన అనురాధ, 8వ వార్డు జనసేన అధ్యక్షుడు శేఖరశ్రీను, ఏడవ జనసేన నేత గురు స్వామి శ్రీను, జగ్గు పెళ్లి నాని తదితరులు పాల్గొన్నారు.