అనకాపల్లి నియోజకవర్గం- (ప్రజాబలం న్యూస్ ) ----కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా దామా సుమంత్
గాజువాకకి చెందిన వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, వైసీపీ సిఈసి మెంబర్, 86వ వార్డు వైసీపీ ఇంచార్జ్ దామా సుబ్బారావు కుమారుడు దామా సుమంత్కి ఏపీ ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించింది. ఈ సందర్బంగా ఉత్తరాంధ్ర ఇంచార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పారు.