భీమిలి
నియోజకవర్గం (మధురవాడ )----పాండ్రంగి బ్రిజ్డి నిర్మాణాన్ని త్వరలో టెండర్లు వేసి పనులు చేపడతామని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఆయన మంత్రి గా ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి పాండ్రంగి బ్రిడ్జి నిర్మాణం చేయాలని తీసుకెళ్లడంతో స్పందించిన జగన్ బ్రిడ్జినిర్మాణం కై 14 కోట్లు రూ మంజారు చేశారు.. దానికి అవంతి శంకుస్థాపన చేసినప్పటికీ వర్షాల కారణంగా ఏరు పారడంతో దాని నిర్మాణ పనులు అప్పట్లో జరగలేదు. దీంతో ఆలస్యం కావడంతో నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిపోయాయి. ఆ నిర్మాణానికి కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. దీంతో ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్య అవంతి,తీసుకువెళ్లగా బ్రిడ్జి నిర్మాణం కి నిదులు వ్యయం పెంచమని, రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ముత్యాలనాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో 14 కోట్లు రూ అదనంగా మరో 2 కోట్లు 80 లక్షలు రూ మంజూరు చేయడం తో మొత్తం 16 కోట్ల 80 లక్షలు రూ నిధులు అయ్యాయి. నూతనంగా టెండర్ లు వేసి బ్రిడ్జి పనులు త్వరితగతిన ప్రారంబించి పూర్తి చేయడం జరుగుతుందని అవంతి తెలిపారు. అదనంగా నిధులు పెంచి బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.