2018 డిఎస్సీ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు-- విద్యాశాఖ అధికారి చంద్రకళ

 భీమిలి నియోజకవర్గం-- ఆనందపురం మండలం...( ప్రజాబలం న్యూస్ )

ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా తరగతులు.



2018లో నూతనంగా డీఎస్సీ ద్వారా సెలక్ట్ అయిన హిందీ, సోషల్ ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణా కార్యక్రమం నారాయణ హై స్కూల్ పెద్దిపాలెం క్యాంపస్ నందు జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి ఎల్. చంద్రకళ ప్రారంభించారు. నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన ఉపాధ్యాయులు శిక్షణ లో మెలకువలను, పాఠ్య ప్రణాళిక నిర్మాణం, పాఠ్యాంశాల యెడల అవగాహన, ప్రభుత్వ పథకాలు, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు, టి.ఎల్.ఎం గురించి నూతన విద్యా విధానం 2020 ఎడల అవగాహన వివిధ అంశాలపై ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని. ఆమె తెలియజేశారు. ఏపీసి శ్రీనివాసరావు , కోర్స్ డైరెక్టర్ గౌరీ శంకర్ , ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని 2018 లో నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.

ఎస్ సి ఇ ఆర్ టి పరిశీలకులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ హిందీ దేశాన్ని ఐకమత్యం అనే సూత్రంలో కట్టివేసే భాష అని హిందీ ఉపాధ్యాయులు, నిబద్దతో పనిచేసి హిందీలో నైపుణ్యాలను పెంచాలని, హిందీలో మాట్లాడటం విద్యార్థులకు నేర్పించాలని దానికి ఉపయుక్తమైన పద్ధతులను ఈ శిక్షణ ద్వారా నేర్చుకొని, సమాజంలో మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ టి.ఎస్.వి. ప్రసాదరావు, ఎం వివిఎన్ బలరాంమూర్తి, మధుమతి ,సంపత్ కృష్ణ ,భాషా ,సతీష్, సుధాకర్, ఝాన్సీ, పాల్గొన్నారు.