నిబంధనల పేరుతో అక్రిడేషన్ల కోత ను వ్యతిరేకిస్తూ 22 న ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు జయప్రదం చేయండి:
- ఏపీయూడబ్ల్యూజే పిలుపు
విశాఖపట్నం (ప్రజాబలం న్యూస్ ) జర్నలిస్టులకు నిబంధనల పేరుతో అక్రిడేషన్ల కోతను వ్యతిరేకిస్తూ ఈ నెల 27న జరిగే ధర్నా లలో జర్నలిస్టులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఏపీయూడబ్ల్యూజే పిలుపునిచ్చింది.
అక్రిడేషన్ నిబంధనల సడలింపు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడడం లేదు. రెగ్యులర్ గా వచ్చే పేపర్స్ సర్క్యులేషన్ 3 లక్షలకు పైగా ఉంటేనే(సీఏ సర్టిఫికేట్) మండలానికి ఒక్క అక్రిడేషన్ ఇవ్వాలన్న నిర్ణయం చూస్తే జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని తెలియజేస్తుంది. ఈ నిబంధన జర్నలిస్టులకు చాలా ఇబ్బంది కరమైంది. కనుక ఈ నిభందన ఎత్తేయాలి. గతంలో మాదిరి 75 వేలు నుంచి 3 లక్షల లోపు సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు ప్రతి మండల రిపోర్టర్ కు అక్రిడేషన్ ఇవ్వాలి. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కు ప్రతి కొత్త జిల్లా కేంద్రంలో 4 అక్రిడేషన్లు, స్థానిక చిన్న పత్రికలకు నియోజకవర్గం కు ఒక అక్రిడేషన్ ఇవ్వాలన్న డిమాండ్స్ ను ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే ఇక వేచిచూసినా ఉపయోగం ఉండేలా లేదు. ఈ విషయంలో సమాచార శాఖ అధికారుల వైఖరి జర్నలిస్టులకు ఏ మాత్రం అనుకూలంగా లేదు. అందుకే మనం ఆందోళన ఉదృతం చేయక తప్పదు. మొదటగా సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ల ఎదుట ధర్నాలు, డీపీఆర్వో కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాలి. ఫలితం రాకపోతే.. మరో రెండు రోజుల్లోనే మరో రూపంలో ఆందోళన కార్యక్రమం చేపడదాం. మన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (APUWJ) పిలుపు నిస్తుంది..
యూనియన్ నేతలు
అంబటి ఆంజనేయులు, APUWJ యూనియన్ గౌరవ సలహాదారులు
ఐ.వి.సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్షడు,
చందు జనార్దన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ