అనారోగ్యంతో బాధపడుతున్న- సుంకరికి- 75 వేల రూపాయల సి ఎం నిధి నుండి మంజూరు చెక్కును అందజేసిన- భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.

 సీఎం సహాయనిది 75 వేల రూపాయలు చెక్కు అందజేసిన --భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.



భీమిలి నియోజకవర్గం - ఆనందపురం - (ప్రజాబలం న్యూస్)


అనందపురం మండలం లో గల ఆనందపురం పంచాయతీ కి చెందిన సుంకరి జయలక్ష్మి అనారోగ్యం పాలు కావడంతో వైద్య ఖర్చులు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 75 వేల రూపాయలు మంజూరు అయ్యింది. బాధితురాలు జయలక్ష్మి అవంతిని కొద్దిరోజుల క్రితం అభ్యర్థించడంతో ఎంతో దయార్థ హృదయంతో వెంటనే స్పందించి ఆయన సియం సహాయ నిది కి విజ్ఞప్తి చేయడంతో నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా బాధితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి,ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడతల రజినీకి, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు.