కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన --- జననేత పరుచూరి

 అనకాపల్లి జిల్లా-----


ప్రజా బలం న్యూస్--- జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు ఇంటి ఇంటికి ప్రచారం జనసేన ప్రజాబాట కార్యక్రమం సోమవారం తెల్లవారుజామున శుభ ముహుర్తానికి లంచానంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత అనకాపల్లి పట్టణం నాలుగు రోడ్ల కూడలి వద్ద గల వినాయకుడి గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణం లో కొంత మంది ప్రముఖుల ఇళ్ళకి వెళ్లి కరపత్రాలు అందజేశారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లిలో జనసేన పార్టీ కి అవకాశం ఇచ్చి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థించారు.ఈ సందర్బంగా వారికి శాలువాలు కప్పి సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.అనంతరం కన్యాకాపరమేశ్వరి ఆలయం లో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు భాస్కరరావు ని సత్కరించి అమ్మవారి ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఎమ్మెల్యే గా విజయం సాధిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.