కనకదుర్గ అమ్మవారి జాతర ముగింపులో -- సీనియర్ టిడిపి నేతలక్ష్మణరావు..

 శ్రీ కనకదుర్గ అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధన.

భీమిలి నియోజకవర్గం.

 (ప్రజాబలం న్యూస్ )మధురవాడ జీవీఎంసీ జోన్ టూ లో ఐదో వార్డ్ పరిధిలో మధురవాడ వైఎస్సార్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవములు మంగళవారం ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు పాల్గొని వారి చేతుల మీదగా అన్న ప్రసాదం ను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ వైయస్సార్ కాలనీ లో కొలువైయున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కాలనీ పెద్దలు నిర్వహించారని, అలాగే ఈరోజు సుమారు 3500 మందికి అన్న సమారాధన నిర్వహించారని తెలిపారు . ఈ కార్యక్రమంలో కనకదుర్గ ఈవెంట్ అధినేత సురేష్, టిడిపి భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, టిడిపి వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, ఉపాధ్యక్షులు వి నాయుడు ఆలయ కమిటీ సభ్యులు అచ్యుతరావు ,ఓలేటి శ్రావణ్, హరికృష్ణ ,మోహన్రావు , రవి, అప్పారావు, వాసుదేవ్, సురేష్ ,రాజు , భాస్కర్ రావు, రాంబాబు , గణేష్ , లక్ష్మి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.