భీమిలి నియోజకవ
ర్గం మద్ది (ప్రజాబలం న్యూస్ )- రైతులకు అండగా జగనన్న ప్రభుత్వం-- భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ - రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతగానో దోహద పడుతున్నాయనిభీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మద్ది పంచాయతీల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
దివంగత నేత రాజశేఖరరెడ్డి రెడ్డి పాదయాత్ర లో రైతులు కష్టాలు విని వారి ఆత్మహత్యలు చూసి ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులు కు వ్యవసాయం చేసుకునేందుకు ఉచిత విద్యుత్ అందించారని గుర్తు చేశారు. ఆయన కుమారుడు జగనన్న రైతే రాజు అనే రీతిలో రైతులు పండించిన పంట కు గిట్టు బాటు దర కల్పించడం తో పోటు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచారని అన్నారు. అక్కడే మేలు రకములైన విత్తనాలు ఎరువులు అందించి, అకాల వర్షాలతో పంట నష్టం కలిగితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారితో సర్వే జరిపించి తక్షణ సహాయం అందిస్తున్నారని చెప్పారు. పంట రుణాలు కల్పించడం, వ్యవసాయం లో ఎన్నో నూతన సంస్కరణలు తీసుకువచ్చి, వ్యవసాయం దండుగ అని గత ప్రభుత్వంలో ఉన్నవారు రైతులనుహేళన చేశారని, మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం పండుగ అనే లా చేసి చూపించారని పేర్కొన్నారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనే మన దేశంలో రైతు దేవోభవ అనే రోజు రావాలని ఎందుకంటే పంట పండించే రైతు లేకపోతే అన్నం ఎలా పెట్టాలో మన అమ్మ కు కూడా తెలియదనిపేర్కొన్నారు. అలాంటి రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన పాలన వైసిపి ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతిపక్షాలు రైతు లకు చేసింది ఏమిలేదు గాని, వైసిపి ప్రభుత్వం పండించిన పంటలను మొక్కజొన్న పంట లను కొనుగోలు చేయకుండా, రైతులు ఆకలి కేకలు చూస్తున్నారు అని అనడం చాలా ఆస్యాస్పందంగా ఉందనిచెప్పారు.,మీరు ఒకసారి పంచాయతీ లలో కదలాడి చూస్తే జగన్ ప్రజలకు అందిస్తున్న పాలన కోసం మీకు తెలుస్తుందని ఇకనైనా ఇలాంటి చౌకబారు ప్రచారాలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హితువు పలికారు. మాటలు కాక చేతలతో చేసి చూపే ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని నెను ఓ రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డనే,మా ప్రభుత్వం పేదల సంక్షేమం తో పాటు రైతులు సంక్షేమం కోసం పాటు పడుతుందనిఅన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మండలం ముఖ్య నాయకులు సర్పంచ్ లు యంపిటిసి లు ఆయా పదవుల్లో ఉన్న సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు పాల్గొన్నారు.