- విజయనగరం
జిల్లా (ప్రజాబలం న్యూస్) -----భోగాపురం లో నూతనంగా నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయం కి రేపు తేది 03-05-201 గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా శంకుస్థాపన పనులను బహిరంగ సభా ప్రాంగణ పనులను , విమానాశ్రయం నమూనాను టిటిడి చైర్మన్ - మూడు జిల్లాల కోఆర్డినేటర్ (ప్రాంతీయ కన్వినర్) గౌ. వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈయనతో పాటు
మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా జెడ్పిటిసి చైర్మన్ మజ్జి శ్రీను, ఆ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని పార్టీ నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.