అమ్మ ఒడిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్

 మధురవాడ--


- (ప్రజాబలం న్యూస్ )--- మదర్స్ డే సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు సీనియర్ టిడిపి నేత గంటా శ్రీనివాసరావు, ఆయన తనయుడు రవితేజ తో పాటు అమ్మఒడి బాలుర సంరక్షణ కేంద్రంలో బాల బాలికలు చేత కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా పిల్లలతో మాజీ మంత్రి గంటా కాసేపు సరదాగా గడిపారు. పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేశారు. వారే స్వయంగావడ్డించారు. ఈ కార్యక్రమంలో6 వ వార్డ్ టిడిపి అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, గంటా మాజీ పిఏ,ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.