భీమిలి నియోజకవర్గం- మధురవాడ - (ప్రజాబలం న్యూస్)
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా సీఐటి యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులు కళా ప్రదర్శనలతో సాంకృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సి ఐ టీ యు మభూరవాడ జోన్ కమిటీ తెలియజేసింది.
ఈ సందర్భంగా మధురవాడ 7వ వార్డు ద్రోణం రాజు కళ్యాణ మండపం లో వారోత్సవాల్లో భాగంగా ఈ సాంస్కృతిక కార్యక్రమం ను నిర్వహించారు.
కార్మికులు,వారి పిల్లలు వివిధ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.అభ్యుదయ గీతాలు ఆలపించడం తో పాటు, కార్మిక,అభ్యుదయ,జానపద గీతాలకు నృత్యాలు చేశారు.వీక్షకులను ఎంతగానో అలరించారు.
వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం తో పాటు,ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు అమ్ముతుతున్నది స్క్రిట్లు,చిన్నచిన్న నాటికలు వేసి ఆకట్టుకున్నారు.ఈ ప్రదర్శనలు మల్లయ్య పాలెం,పరదేశి పాలెం,కొమ్మధి ఎస్ సి కాలనీ నుండి వచ్చిన కళా కారులు ప్రదర్శించారు. బీ పుణ్యవతి,డి ఉమాశైలజ, కే తేజు శిక్షణ ఇచ్చారు.
అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్న బాలను,కార్మికులను ఎంతగానో అభిందంచారు.మన దేశంలోని, రాష్ట్రంలోనూ కార్మిక వర్గం పై తీవ్రమైన దాడి జరుగుతుందని అన్నారు.కార్మికులు ఎన్నో త్యాగాలు చేసి,ప్రాణాలు అర్పించి 8 గంటల పని దినం సాధించి పెడితే,నేటి బీజేపీ పాలకులు కార్మికుల తో 12 గంటలు పని చేయించుకోవచ్చు చెపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రానున్న రోజుల్లో మే డే స్పూర్తితో కార్మికులు ప్రజలు హక్కులు కాపాడు కోవడం కోసం ఉద్యమాల బాట పట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జోన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి రాజు కుమార్,డి కొండమ్మ, ఇతర సంఘాల నాయకులు జీ కిరణ్,ఎస్ రామప్పడు,సి హెచ్ శేషు బాబు,తదితరులు పాల్గొన్నారు.