భీమిలి నియోజకవర్గం (ప్రజాబలం న్యూస్) ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి ముగింపు కార్యక్రమంలో ప్రజల నుండి సేకరించిన సమస్యల పై ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా ప్రశ్నించిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు -- భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఇన్చార్జి టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు అధ్యక్షతన ఇదేం కర్మ మన రాష్ట్రానికి ముగింపు కార్యక్రమంలో భాగంగా పత్రిక మీడియా సమావేశం నిర్వహించి ప్రజల నుంచి సేకరించిన సమస్యలు పై మీడియా ముఖంగా వైసీపీ ప్రభుత్వానికి నిలదీసి,సమస్యలు రాసిన దరఖాస్తులను అట్ట పెట్టెలలో భద్రపరిచి ఆ పెట్టెలను వాహనంలో పెట్టి, వాహనాన్ని జండా ఊపి విశాఖ పార్లమెంట్ కార్యాలానికి తరలించారు
ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మూడో డివిజన్ ఉపాధ్యక్షులు పెంటపల్లి యోగేశ్వరరావు మారోజు సంజీవ్ కుమార్ యువత అధ్యక్షులు కనకల అప్పలనాయుడు అధికార ప్రతినిధి కాసరాపు ఎల్లాజీ భీమిలి నియోజకవర్గం యువత అధ్యక్షులు షినగం రామకృష్ణ నియోజకవర్గ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గుండు చిన్నబాబు తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.