పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం---- మాజీ మంత్రి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్
భీమిలి నియోజకవర్గం - 4వ వార్డు జేవి ఆగ్రహారం (సచివాలయం కోడ్ 10390241) - - మంగళ వారం
బోర రామకృష్ణ యాదవ్ ఆద్వర్యంలో జేవి అగ్రహారం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా అవంతికి ఘన స్వాగతం పలికారు.
ఈపర్యటన లో బాగంగా వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు పాలన నాలుగు ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అవంతి చేతులు మీదుగా కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకొని, స్వీట్స్ బాక్స్ లు అందరికీ అందజేశారు.
మొదటి రోజు పర్యటన లో బాగంగా 480 ఇళ్ళు గడప గడపకు వెళ్ళి నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అమలు తీరున ప్రజలను అడిగి తెలుసుకున్నారు
అనంతరం ఎమ్మెల్యేఅవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందని ఇప్పుడు పేదలకు పెత్తందారులకి మద్య జరుగుతున్న యుద్దం అని రాజన్న రాజ్యం జగనన్న తో సాద్యంఅని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలన ఉందని మనకి ఏదైనా అవసరం ఉంటే ప్రభుత్వ అధికారులు కార్యాలయాలు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే పరిస్థితి నుంచి మన వద్దకే ప్రభుత్వ యంత్రాంగం వచ్చేలా చేసిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని,మీరంతా ఆయన వెంట ఉండాలని గత ప్రభుత్వాలు ఉన్నోడికి కొమ్ము కాస్తే, వైసిపి ప్రభుత్వం పేదల పక్షపాతి అయి ప్రతీ పేద మధ్య తరగతి వాడి కళ్ళల్లో ఆనందమే చూడటమే లక్ష్యంగా పని చేస్తుందనిఅన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అన్ని విధాలా పెద్దపీట వేసిందని,మీరంతా ఆయన పక్షాన నిలిచి రాబోయే ఎన్నికల్లో వైసిపి పార్టీ ని గెలిపించి మరింత మంచి పాలన అందించడానికి తోడ్పాటుఇవ్వాలని కోరారు.
నాలుగేళ్ళ పాలనపై ప్రజలు అబిప్రాయం అడగగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా కూడా లంచం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి శాసనసభ్యులు అవంతి అందిస్తున్న పాలన వలన నేరుగా మా వద్దకే పాలన అందింస్తున్నందుకు చాలా సంతోషం గా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
కోలనీ లోలో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజల ను అవంతి అడగగా
జేవి అగ్యహారం యస్సి కోలనీ - కొయ్య పేట - ఈత పేట లో అవంతి శ్రీనివాసరావు దృష్టిలో పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు
యస్సి కోలనీ లో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని,
త్రాగునీటి సౌకర్యార్థం ఇంటింటికి కొళాయిలు నిర్మాణం చేపట్టాలని,
చందక వారి కళ్ళాలు లో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని,
పలు కారణాలు చేత సంక్షేమ పథకాలు అమలు అందలేదు వీలైతే కారణాలు సమస్య తీర్చి పథకాలు అందేలా చేయాలని
సమస్యలు విన్న అవంతి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. - తమ సమస్యలు పరిష్కారం కి శ్రీకారం చుట్టిన అవంతి కి స్థానికులు సంతోషం తో దన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు వార్డు వైసిపి శ్రేణులు ఆయా పదవుల్లో ఉన్న వారు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.