పీఎం పాలెం
పోలీసులు అదుపులో గంజాయిస్ స్మగ్లర్లు.-- మూడు బ్యాగుల గంజాయి ఆర్టీసీ బస్సులో రవాణా. --మధురవాడ--- ఎక్స్ప్రెస్ న్యూస్ ---ఒరిస్సా లోని నవరంగపూర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులో మూడు బ్యాగులతోగంజాయి పట్టుబడింది.శుక్రవారం సాయంత్రం డ్రైవర్ వెంకటేశ్వరరావు పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్కు ఆ బస్సు నేరుగా తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఒరిస్సా లోని నవరంగపూర్ నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరిన బస్సు తగరపువలస వచ్చేసరికి విజయనగరం డిపో నుండి డబ్బులతో బ్యాగ్ పోయిందని డ్రైవర్ వెంకటేశ్వర రావుకి ఒక ఫోన్ కాల్ వచ్చింది వెంటనే డ్రైవర్ పాసింజర్లను రిక్వెస్ట్ చేసి బ్యాగుల చెకప్ చేశాడు. దీంతో రెండు గంజాయి బ్యాగులు, తో పాటు మరొకగంజాయి బ్యాగు కూడా బయటపడింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ నేరుగా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాడు. దీనిని గమనించిన గంజాయిస్మగ్లర్ ఒకరు తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు వెంటపడినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే వైట్ షర్ట్ తో ఉన్న మరొక వ్యక్తి మూడో బ్యాగ్ తో పట్టుబడి పోలీసుల అదుపులో ఉన్నట్లు డ్రైవర్ చెప్పారు. పది కేజీలు గంజాయి ఉంటుందని ప్రయాణికులు, డ్రైవర్లు అంచనాగా చెప్పారు. ప్రయాణికులు డ్రైవర్ నుండి వాంగ్మూలాల తీసుకొని పోలీసులు బస్సునుసాయంత్రం వదిలిపెట్టారు. సిఐ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియ
జేస్తామని తెలిపారు.