అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి విజిలెన్స్ కమిటీ జాతీయ కార్యదర్శి గా స్వాతి సుధాకర్.
భీమిలి నియోజకవర్గం.-- (ప్రజాబలం న్యూస్ )
అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి జాతీయ విజిలెన్స్ కమిటి కార్యదర్శి గా భాగం స్వాతి సుధాకర్ ను నియమించినట్లు వ్యవస్థాపక చైర్మన్ బి.అనూషా రాథోడ్ జారీ చేసిన పత్రాన్ని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లీగల్ సర్వీస్ కౌన్సిల్ వర్కింగ్ ఛైర్మన్ ఓరుగంటి సుబ్బారావు అందించారు. గతంలో ఎంటీ కరప్షన్ ఎవరినెష్ జాతీయ డైరెక్టర్ గా పలు సేవలు తో పాటు సేవా కార్యక్రమాలు చేశారని ఓరుగంటి సుబ్బారావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్వాతి సుధాకర్ మాట్లాడుతూ మానవాళి అంతా ఒకే కుటుంబం ఈ కుటుంబం లో ప్రతీ ఒక్కరకీ సహజ సిద్ధమైన గౌరవం , సమానమైన శాశ్వత హక్కులు ఉన్నాయని వీటిని గుర్తించడం ద్వారా ప్రపంచంలో స్వేచ్చా న్యాయం ,శాంతి లకు పునాది వేయవచ్చు అని అన్నారు. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం తిరస్కారాలు క్రూరమైన దుష్టాత్మలకు కారణమయ్యాయని ఇవి మానవ అంతరాత్మ కు గాయం చేశాయని,అంతేకాక భావప్రకటనా స్వేచ్చా విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ భయం లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష అని దానిని సాధించడం కోసం కృషి చేస్తానని నిరంకుశత్వానికి అణిచివేత కు వ్యతిరేకంగా మనుషులు చిట్ట చివరి మార్గంగా, తిరుగుబాటు లను ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కుల చట్టబద్ద పాలన (రూల్ ఆఫ్ లా) తో రక్షించాలని, ప్రజలు మద్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించడం అవసరం అన్నారు. సమాజం లో ప్రతీ ఒక్కరూ విసృత స్వాతంత్ర్యం తో సామాజిక ప్రగతిని ఉత్తమ జీవన ప్రమాణాలు ను పెంపొందించడానికి సంకల్పించాలని అంతే కాకుండా, మహిళా హక్కులు బాలల హక్కులు కోసం వివిధ కార్యక్రమాలు చేపడతామని అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి ద్వారా మానవ హక్కులు ప్రాథమిక స్వాతంత్ర్యాలకు విశ్వజనీన గౌరవాన్ని పెంపొదిస్తాయని రాజ్యాంగం ప్రాథమిక హక్కులు అందరికీ దక్కేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సామాన్య ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతున్నా వెంటనే సంప్రదించాలన్నారు. తనను నియామకం చేసిన సంస్థ వ్యవస్థాపకులైన అనూషా రాథోడ్, వర్కింగ్ ఛైర్మన్ ఓరుగంటి సుబ్బారావు లకు ఈ సందర్భంగా స్వాతి సుధాకర్ కృతజ్ఞతలు తెలిపా
రు.