చంద్రబాబు తోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం--- భీమిలి టిడిపి ఇన్చార్జ్ కోరాడ

 జగన్నా'సుర పాలనకు అంతం.. టీడీపీకే సాధ్యం.

 భీమిలి ఇంచార్జ్ కోరాడ రాజబాబు



 భీమిలి నియోజకవర్గం --- ప్రజాబలం న్యూస్---


           దుర్గామాత చేతిలో నరకాసురుడు అంతం అయినట్లు.. నేడు ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తున్న జగన్నా'సురిని చిత్తు చిత్తుగా ఓడించుటకు ఆంధ్ర ప్రజలు మమేకం కావాలని తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.


          భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జగన్నాసుర కార్యక్రమంలో భాగంగా కోరాడ రాజబాబు మాట్లాడారు. వైకాపాకు చెందిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే జగన్ రెడ్డిని నమ్మడం లేదని అన్నారు. ఇక రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రజల సానుభూతిని పొందుటకు సొంత చిన్నాన్ననే హతం చేసిన వ్యక్తి రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారని నిలదీశారు. ప్రజలకు ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదని తెలిసే.. నా నమ్మకం నీవే జగన్ అనే కొత్త నాటకానికి తెరతీశారని అన్నారు. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా లాంటి ఎన్నో అరాచకాలతో రాష్ట్రం ఎ 1గా ఉందని దుయ్యబట్టారు. జగన్నాసుర రాష్ట్ర పాలనకు నూకలు చల్లే రోజులు దగ్గర పడ్డాయని, దీనికి నిదర్శనం మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమానికి వెళితే అక్కడ ప్రజల తిరుగుబాటే ఒక ఉదాహరణ అని అన్నారు. మరలా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అప్పుడే అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా ఉండగలరని అన్నారు. మహుళలు, యువత, విద్యా వంతులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా..? అని ఎదురు చూస్తున్నారని, జగన్నాసుర పాలనకు అంతం దగ్గర పడిందని చెప్తూ జగనాసుర వాల్ పోస్టర్లను చించి నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గొల్లంగి ఆనందబాబు రాష్ట్ర వాణిజ్య విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిల్లా వెంకట్రావు విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాండ్రాసి అప్పలరాజు రాష్ట్ర టిఎన్టియుసి జనరల్ సెక్రెటరీ నాగోతి శివాజీ విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మీసాల సత్యనారాయణ విశాఖ పార్లమెంట్ యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ గన్రెడ్డి రమేష్ ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు బొద్దాపు శ్రీనివాస పద్మనాభం మండల పార్టీ ప్రెసిడెంట్ కోరాడ రమణ విశాఖ పార్లమెంట్ యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ్ విశాఖ పార్లమెంట్ కార్యదర్శి జోగా ముత్యాలు నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు పాసి త్రినాథ్ కుమార్ జనరల్ సెక్రెటరీ దంతులూరి సిద్ధార్థ వర్మ చిలక నర్సింగరావు గరే సదానంద ఆరో వార్డ్ జనరల్ సెక్రెటరీ నాగేశ్వరరావు మామిడిలో ఒక సర్పంచ్ బలిరెడ్డి మల్లికార్జునరావు చంటి టిఎన్టియుసి అధ్యక్షులు నరవ రామారావు షినగం శివ మారోజు సంజీవ్ కుమార్ వాసుపల్లి వంశీ తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులుపాల్గొన్నారు.